FbTelugu

తిరుమలకు భక్తుల కరువు

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంపై కరోనా ప్రభావం పడింది. ఆదాయమే లక్ష్యంగా దర్శనాలకు ద్వారాలు తెరిచినప్పటికీ భక్తులు మాత్రం వెనకంజ వేస్తున్నారు.

ఆన్ లైన్ లో ప్రతినిత్యం 30వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందుబాటులో పెట్టినప్పటికీ వెంకన్న భక్తులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వీలైనంతగా ఎక్కువ మందికి దర్శనం కల్పించి హుండీ నింపుకునే ప్రయత్నం చేస్తున్న టిటిడి చర్యలపై విమర్శలొస్తున్నాయి. స్పందన లేకపోవడంతో ఈ సంఖ్యను కుదించాలనే యోచనలో ఉన్నారు. కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు టిటిడి ఆధ్వర్యంలోని ఒంటిమిట్ట, శ్రీనివాస మంగాపురం ఆలయాలను మూసివేశారు. అలిపిరి వద్ద ప్రతిరోజు జారీ చేసే 20వేల సర్వదర్శనం టోకెన్ల విక్రయిన్ని నిలిపి వేసిన విషయం తెలిసిందే. కరోనా విలయం స్పష్టంగా కన్పిస్తున్నా టిటిడి ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం.

You might also like

Leave A Reply

Your email address will not be published.