FbTelugu

స్టాక్ మార్కెట్ కు కరోనా ఎఫెక్ట్

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ వేగంగా విస్తరించడం, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ ఆరంభంలోనే భారీ పతనాన్ని నమోదు చేసింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలోనూ భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
ఇవాళ ఉదయం సెన్సెక్స్‌ 916, నిఫ్టీ 276పాయింట్ల మేర నష్టపోయాయి. ఆ తరువాత మరింత క్షీణించి ప్రస్తుతం సెన్సెక్స్‌ 1160 పాయింట్ల నష్టంతో 48430 వద్ద, నిఫ్టీ 354 పాయింట్లు పతనమై 14482 వద్ద కొనసాగుతోంది.

దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల దెబ్బతో కుప్పకూలడంతో వాణిజ్య వర్గాలు నివ్వెరపోయాయి. నిఫ్టీ బ్యాంకు కూడా దాదాపు 1200 పాయింట్లు క్షీణించడంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 1353పాయింట్ల నష్టంతో 484237వద్ద, నిఫ్టీ 411 పాయింట్లు పతనమై 14423 వద్ద కొనసాగుతోంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లు అమలవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితంగా చేస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.