FbTelugu

గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం!

న్యూఢిల్లీ : ఈ సారి గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం ఉంటుందా అంటే కచ్చితంగా ఉంటుందనే చెప్పవచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అధికారులు 2021 జనవరి 26 రిప‌బ్లిక్ డే వేడుకల్లో అనేక మార్పులు చేసినట్టు సమాచారం. ఈ సారి విజ‌య్ చౌక్ నుంచి నేష‌న‌ల్ స్టేడియం వ‌ర‌కే ప‌రేడ్ ఉంటుంద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

ప‌రేడ్‌లో పాల్గొనే అంద‌రూ క‌చ్చితంగా మాస్కులు ధ‌రించాల్సి ఉంటుంది. రిప‌బ్లిక్ డే చ‌రిత్ర‌లో తొలిసారి ప‌రేడ్ ఎర్ర కోట కంటే ముందే ముగియ‌నున్న‌ది. ఈ సారి పరేడ్ డిస్టాన్స్ కూడా భారీగా కుదించారు. 8.2 కిలోమీట‌ర్ల నుంచి 3.3 కిలోమీట‌ర్ల‌కు కుదించారు. ప‌రేడ్‌లో ఉండే బృందాల్లో స‌భ్యుల సంఖ్య 144 నుంచి 96 కు కుదించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.