FbTelugu

కోవిడ్ దెబ్బకు చైనా విలవిల

కోవిడ్-19 (కరోనా వైరస్) దెబ్బకు చైనా విలవిలలాడుతోంది. దాదాపు అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఈ వైరస్ ఓ వైపు ప్రాణాలను హరిస్తూ ఉండగా.. మరోపక్క వాణిజ్యం తీవ్రస్తాయిలో పడిపోయింది. ప్రధానంగా వాహన తయారీ రంగం తీవ్ర గడ్డు కాలాన్ని ఎల్లదీస్తోంది. కరోనా దెబ్బకు ఈ రంగం ఈ ఏడాది ఏకంగా సుమారు 20 శాతం పడిపోయినట్టు చైనా వాహన తయారీ సంస్థల సమాఖ్య (సీఏఏఎం) ప్రకటించింది. ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాల్సిందే.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More