FbTelugu

కరోనా ఎఫెక్టు… తల్లీ కూతురు ఆత్మహత్య

అనంతపురం: తాడిపత్రి పట్టణంలోని బిందెల కాలనీలో నివాసముంటున్న తల్లీ కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం కాలనీవాసులకు కన్నీళ్లు తెప్పించింది.

కొద్ది రోజుల క్రితం రామకృష్ణా రెడ్డి కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి భార్య రమణమ్మ, కుమార్తె అపర్ణ దిగాలుగా ఉంటున్నారు. ఇంటి పెద్ద చనిపోవడం భార్యతో పాటు కుమార్తెను తీవ్రంగా కలచివేసింది. కుమార్తె అపర్ణ శనగలగూడూరు లో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్నది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని భార్య రమణమ్మ, కుమార్తె అపర్ణలు ఇవాళ ఇంట్లో పురుగుల మందు సేవించి బలవన్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.