FbTelugu

మృతదేహంతో కరోనా వ్యాప్తి జరగదు

అమరావతి: కరోనా పాజిటివ్ తో చనిపోయిన మృతదేహం ద్వారా వైరస్ వ్యాప్తి జరగదని, బాధ్యత రాహిత్యంగా ఉన్న వ్యక్తుల ద్వారా మాత్రమే వ్యాప్తి జరుగుతుంది వైద్య నిపుణులు చెబుతున్నారు.

స్విచ్ ఆఫ్ చేస్తే కరెంటు ఆగిపోయినట్లు, ప్రాణం పోయిన తర్వాత వైరస్ ఉత్పత్తి ఆగిపోతుంది. మృత దేహాన్ని నేరుగా తాకడం వంటి పనులు చేయవద్దు. మరణించిన బంధు మిత్రులు అనాధ శవాలుగా ఆత్మ ఘోషించవద్దు. గౌరవ ప్రదమైన అంత్యక్రియలు జరపండి, వారి కుటుంబాలకు అండగా ఉండండి. కరోనా వైరస్ కేవలం బ్రతికి ఉన్న మనిషిలోని బ్రతికి ఉంటది. చనిపోయిన ఆరు గంటలకే నిర్వీర్యం అవుతుంది. మృత దేహాన్ని హైపోక్లోరినేషన్, ఇతర శానిటైజర్ ద్రవంతో తూడ్చాలి. శవాన్ని మోసుకువెళ్లే ఆ నలుగురు మాస్క్ , గ్లోవ్స్ , పేస్ షెయిల్డ్ ఉంటె పిపిఈ కిట్ వేసుకుంటే సరిపోతుంది. మృతదేహంపై కుటుంబ సభ్యులు మీద పడి ఏడవొద్దు. ఇంటిలోపల గుమి కుదవద్దు. అందరు ఆరుబయట ఉంటే సురక్షితం. ముఖ్యంగా చిన్న చిన్న ళ్లు, ఇరుకు గదులు ఉన్నవాళ్లు అయితే వెంటనే దహన సంస్కారాలు చేయాలి. దశ దిన కర్మ కుటుంబానికి పరిమితం చేయండి. ఊరందరినీ పిలవకండని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ నియమాలు తెలిసిన వారు, విద్యావంతులు పాటిస్తున్నారు… కానీ పేద మధ్యతరగతి ప్రజలు ఇంకా పూర్తిగా అవగాహన పెంచుకోవడం లేదు. మన ఆచారం ప్రకారం బంధు మిత్రులు కార్యానికి పిలిస్తే వెళ్లకపోతే అవమానంగా భావిస్తారు. ఆ భావనకు ఇది సమయం కాదు. శుభ కార్యాలకు పోయినా పోకున్నా, మరణం సంభవించిన మీ బంధు మిత్రుల కుటుంబాలకు ఫోన్ ద్వారా లేదా కరోనా నిబంధనలు పాటించి పరామర్శించండి చాలు. ఆర్థికంగా కష్టాలలో ఉన్న మీ బంధు మిత్రులకు మీ శక్తి కొద్ది కొంత ఆర్థిక సహాయం చేయగలిగితే అదే పదివేలు అని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.