FbTelugu

కరోనా డాక్టర్ హాస్పిటల్ సీజ్

వరంగల్: కరోనా పాజిటివ్ రోగులకు ఒక్కరోజులోనే మందు ఇచ్చి తగ్గిస్తానంటూ సోషల్ మీడియాలో సవాల్ విసిరిన హోమియోపతి డా. విఎస్ రెడ్డి హాస్పిటల్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు.

ఇవాళ జిల్లా వైద్యాధికారులు, పోలీసులు హాస్పిటల్ కి చేరుకొని ఆసత్య ప్రచారం చేయడంపై హాస్పిటల్ లో తనిఖీలు చేశారు. ఆ తరువాత ఆయనను ప్రశ్నించి, సరైన ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విఎస్.రెడ్డి సవాల్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత 120 రోజులుగా తమ హాస్పిటల్ లో పనిచేసే సిబ్బంది మాస్కులు ఉపయోగించడం లేదని శానిటైజర్లు వాడడం లేదని ఆయన తెలిపారు.
కరోనా పేషెంట్లను చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి రక్షిస్తానని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తో పాటు ఆయన సిబ్బందికి ప్రివెంటివ్ మెడిసిన్ ఇచ్చినట్లు చెప్పారు. వారిలో 14 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని, ఇద్దరు మందు వాడకపోవడం మూలంగా కరోనా పాజిటివ్ బారిన పడ్డారని చెప్పారు. ఈ సవాల్ సోషల్ మీడియాలో సవాల్ గా మారడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి గట్టి చర్యలు తీసుకున్నారు.

You might also like