FbTelugu

టీవీ పరిశ్రమలో కరోనా కలకలం

హైదరాబాద్: టీవీ సీరియల్ నటుడికి కరోనా సోకింది. దీంతో యూనిట్ సభ్యులు బెంబేలెత్తిపోయారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు షూటింగ్ లు చేసుకోవాడనికి అనుమతిలిచ్చింది.

ఆ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. గత పదిరోజులుగా టీవీ ఛానళ్లు షూటింగ్ లు ప్రారంభించాయి. ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్ కోసం నగర శివారులోని స్టూడియోలో షూటింగ్ నిర్వహించారు. విశాఖపట్నం నుంచి నేరుగా షూటింగ్ కు వచ్చిన ఆర్టిస్ట్ కు తీవ్రమైన జలుబు, దగ్గు రావడంతో పరీక్షించారు. సదరు ఆర్టిస్ట్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో వెంటనే షూటింగ్ ఆపివేశారు.

యూనిట్ లోని సభ్యులందరినీ క్వారంటైన్ కు తరలించారు. ఇదే ఆర్టిస్ట్ మరో ఛానల్ సీరియల్ లో కూడా నటిస్తున్నారు. వారం రోజులుగా ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరితో సన్నిహితంగా ఉన్నాడు అనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.