FbTelugu

విశాఖ వాసుల్లో కరోనా కలవరం

రోజు రోజుకి తీవ్రంగా పెరగిపోతున్న కరోనా కేసులు, మృతుల సంఖ్యతో విశాఖ వాసుల్లో తీవ్ర కలవరం రేపుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 47 మంది కరోనాతో మృతి చెందారు. గత 8 రోజుల్లోనే 34 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.

జిల్లాలో ఈ నెల 11న ఏడుగురు మృతి చెందగా, 12న ముగ్గురు, 13న నలుగురు, 14న ఆరుగురు, 15న ఐదుగురు, 16న ఆరుగురు, 17న ఒకరు చనిపోగా, నిన్న ఇద్దరు మృతి చెందారు. మరోవైపు, నగరంలోని ప్రాంతీయ కొవిడ్ ఆసుపత్రి విమ్స్‌లోనూ మరణాలు రోజు రోజుకి పెరుగిపోతున్నాయి. ఇక్కడ చికిత్స పొందినవారిలో ఈ నెల 17 వరకు 295 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 62 మంది మృతి చెందారు. 179 మందికి ఇంకా చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

You might also like