FbTelugu

అమెరికాలో కరోనా విలయతాండవం

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి కారణంగా.. ఏకంగా 2,108 మంది చనిపోయారు. నేటి వరకు అగ్రరాజ్యం అమెరికాలో.. 5,02,318 మంది కరోనా బారిన పడ్డారు.

ఈ సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగి పోతోంది. కాగా ఇప్పటివరకు కరోనాతో మొత్తం 18,725 మంది మృతి చెందారు. అయితే అత్యధిక మరణాలు న్యూయార్క్ నగరంలోనే సంభవించినట్టు తెలుస్తోంది. వచ్చే వేసవిలో మరణాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపారు.

You might also like