FbTelugu

అమెరికాలో అమాంతం పడిపోయిన కరోనా మరణాలు

వాషింగ్టన్: కరోనా వైరస్ తో విలవిల్లాడిని అమెరికాలో మరణాలు అమాంతం పడిపోయాయి. పది నెలల కనిష్టానికి చేరుకున్నాయి. కొన్ని రాష్ట్రాలలో అయితే మరణాలే లేవు.
ప్రస్తుతం రోజువారి సగటు మరణాలు 600కు చేరుకున్నాయి. దీనంతిటికీ కారణం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా పూర్తిచేయడం. దేశంలో తాజాగా 40వేల లోపే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రతిరోజు రెండున్నర లక్షల చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఏడాది క్రితం దేశంలో కరోనా మరణాలు 3500 కన్నా ఎక్కువగా నమోదు అయిన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా దేశంలో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా ఇస్తుండడంతో విజయవంతం అయ్యింది.

సిడిసి లెక్కల ప్రకారం దేశంలో పెద్దవారికి 75 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. 58 శాతం మందికి ఒక డోసు ఇచ్చేశారు. ఫైజర్ కంపెనీ 12 నుంచి 15 ఏళ్ల విద్యార్థుల కోసం వ్యాక్సిన్ తయారు చేయగా, ప్రభుత్వం అత్యవసరం కింద వినియోగించేందుకు అనుమతులు మంజూరు చేసింది.
ప్రభుత్వం అనుమతించడం తో త్వరలోనే 12 ఏళ్ల లోపు విద్యార్థులకు వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నది. ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి విద్యా సంస్థలను ప్రారంభించాలనే లక్ష్యంతో అమెరికా ప్రభుత్వం ఉంది. దేశంలో సాధారణ పరిస్థితులు తీసుకురావాలనే పట్టుదలతో బైడెన్ ప్రభుత్వం పనిచేస్తున్నది. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవారు మాస్క్ లేకుండా తిరగవచ్చని, జనం ఉన్న ప్రాంతాల్లో మాత్రం మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆంక్షలు సడలించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.