FbTelugu

16 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. కరోనా మృతుల సంఖ్య ఏకంగా 16 వేలు దాటేసింది. దేశంలో లాక్ డౌన్ కు సడలింపులు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి.

దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,28,859 కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 3,09,713 కు చేరింది. దీంతో దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 2,03,051గా ఉంది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 16,095 మంది మృత్యువాత పడ్డారు.

You might also like