FbTelugu

4 లక్షలకు చేరువైన కరోనా మృతుల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. నేటికి ప్రపంచ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 64,79,690 కి చేరింది. కాగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 3,82,227 మంది మృత్యువాత పడ్డారు.

నేటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 30,09,732 కు చేరింది. ప్రపంచ దేశాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి. అమెరికాలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 18,81,205 కు చేరింది. వీరిలో 1,08,059 మంది మృత్యువాత పడ్డారు.

You might also like