ఏపీలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. మంగళవారం ఒక్కరోజే 82 కొవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంమ్మీద 1259 కేసులతో టాప్‌స్థానంలో ఉంది.
నిన్నటి సీఎం జగన్ మోహన్‌రెడ్డి మీడియా సమావేశంలోనూ పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందనే అంశంపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో 1259 కేసుల్లో 31 మంది మరణించారు. 258 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలు, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారింది. గత 24 గంటల్లో 5783 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు.
వీరిలో ఒకేసారి 82 మంది పాజిటివ్‌గా నిర్దారణైంది. కరోనా వైరస్ కృష్ణా 13, కర్నూలు 40, గుంటూరు 17 నెల్లూరులో 03 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కేవలం కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మాత్రమే 70 కేసులున్నాయి. నెలరోజులుగా ఈ మూడు జిల్లాలు ప్రమాదకరంగా మారుతూ ఇప్పుడు చేతులు దాటేంత వరకూ చేరాయి. ముఖ్యంగా గుంటూరు, కర్నూలు, విజయవాడ పట్టణాల్లో ప్రజల నిర్లక్ష్యం. ఇక్కడ కృష్ణలంకలో హాట్‌స్పాట్ గా మారింది.
ఇక్కడే ఏడు కేసులు నమోదయ్యాయి. ఏపీ సర్కారును కంటిమీద నిద్రలేకుండా చేస్తున్నాయి. ఆందోళన కలిగిస్తున్న కేసుల వ్యాప్తిని ఎలా కట్టడి చేయాలో సవాల్‌గా మారింది. 45-60 సంవత్సరాల మధ్య వయసున్న వారే అధికంగా కరోనా భారీన పడుతున్నారు. 60శాతం మంది రోగుల్లో వీరే అధికం. 15 ఏళ్లలోపు 6.5, 60 దాటిన వారు 11.05, మిగిలిన వయసుల వారు మిగిలిన జాబితాలో ఉన్నట్టు ఏపీ వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. మొదటి నుంచి ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. లాక్డౌన్ ఆంక్షలను కట్టుదిట్టం చేస్తూనే ఉన్నారు.
కానీ.. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, లోకల్ నేతల అతి చర్యలతో వైరస్ వ్యాప్తికి కారణమయ్యారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. 13 జిల్లాల్లో మొన్నటి వరకూ విజయనగరం, శ్రీకాకుళం జీరో కేసులతో సురక్షితంగా ఉందనుకున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో 03 కేసులు.. ఆ తరువాత దాని వ్యాప్తి ఎలా ఉందనేది ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేత ఇప్పట్లో లేనట్టే అనేది తెలుస్తోంది. సీఎం జగన్ కూడా మీడియా సమావేశంలో వైరస్ వ్యాప్తి ఎవరి చేతుల్లో లేదని తేల్చినట్టయింది. భయ పడకుండా ధైర్యంగా ఎదుర్కోనేందుకు మానసికంగా సిద్ధం కావటమే ఇప్పుడున్న మార్గమంటూ ప్రజలకు ధైర్యం ఇచ్చారు.