FbTelugu

దేశంలో 90 లక్షలు దాటిన కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. నేటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా 90 లక్షలు దాటింది. దేశంలో గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 46,232 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో కరోనాతో కరోనాతో మ‌రో 564 మంది మృతి చెందారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,50,598 కి చేరింది.

మొత్తం మృతుల సంఖ్య 1,32,726 కి చేరింది. ఇప్పటి వరకు దేశంలో 84,78,124 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 4,39,747 యాక్టీవ్ కేసులున్నాయి. అయితే దేశంలో కొత్తగా నమోదౌతున్న కేసుల కంటే కోలుకునే వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం శుభపరిణామంగా చెప్పవచ్చు.

You might also like

Leave A Reply

Your email address will not be published.