FbTelugu

ఢిల్లీలో కరోనా నియంత్రణ భేష్: కేంద్ర బృందం వెల్లడి

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం హోం ఐసోలేషన్ పేషంట్లకు టెలి మెడిసన్ సేవలు, వారి పర్వవేక్షణ కోసం ప్రవేశపెట్టిన హితం ఆప్ పై నీతి ఆయోగ్ సభ్యులు డా. వినోద్ కుమార్ పాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.

డా.పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తీ ఆహుజా, డా.రవీంద్రన్ తో కూడిన కేంద్ర బృందం ఈ నెల 9, 10 తేదిలలో కోవిడ్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన విషయాలపై రాష్ట్ర అధికారులతో చర్చించేందుకు హైదరాబాద్ లో పర్యటించారు. అనంతరం బిఆర్ కెఆర్ భవన్ లో కేంద్ర బృందం సభ్యులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించారు.

కేంద్ర బృందం ఢిల్లీ లో వైరస్ నివారణకు చేపట్టిన చర్యల పై ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా డా. వి కె.పాల్ మాట్లాడుతూ హితం ఆప్ వివరాలతో పాటు రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై చేపట్టిన మంచి పనులను ఇతర రాష్టాలతో షేర్ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ,  వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు నాయకత్వం లో ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి పనిచేస్తున్నదని, ప్రజల ప్రాణాలు కాపాడటానికి 24 గంటలు పని చేస్తున్నామని రాజేందర్ అన్నారు.

You might also like