FbTelugu

తెలంగాణ తికమక కరోనా బులెటిన్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తికమక లెక్కలు ప్రకటిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టివేస్తున్నది. కరోనా వైరస్ ప్రారంభమైన తొలిరోజుల్లో ఒక రకంగా, ఆ తరువాత మరొక రకంగా మీడియా హెల్త్ బులెటిన్ జారీ చేసేది.

ఇంత వరకు బాగానే ఉంది. కాని రెండు మూడు రోజుల నుంచి తికమక లెక్కలతో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ అయోమయంలోకి నెట్టివేస్తున్నది. కేసులను దాచే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ ప్రకటన చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పేర్కొంటున్న లెక్కలకు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు.

తాజాగా శనివారం విడుదల చేసిన కరోనా పాజిటివ్ లెక్కలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు 74 నమోదు కాగా ఆ లెక్కలను స్పష్టంగా చెప్పకుండా వంకర టింకర లెక్కలు వేసి ప్రకటన విడుదల చేసింది. జిల్లాల వారీగా 60 కేసులు నమోదు అయినట్లు, వలస కూలీలు, విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి నుంచి 14 కేసులు నమోదు అయినట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నది. ఈ రెండు విభాగాల కింద నమోదు అయిన కేసులను కలిపితే మొత్తం 74 అవుతుంది, కాని ఆ సంఖ్య ఎక్కడా పేర్కొనలేదు.

మీడియా బులెటిన్ లో వివరాలు ఇలా ఉన్నాయి…

ఇవాళ పాజిటివ్ కేసులు 74

తెలంగాణా లో 60

ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో 14

ఇవాళ కరోనా తో 6 గురు మృతి

ఇప్పటి వరకు 77 మంది మృతి

ఇప్పటి వరకు 2499 కేసులు నమోదు.

 

telangana health bulletin

You might also like

Leave A Reply

Your email address will not be published.