FbTelugu

చైనా స్కూళ్లపై కరోనా పంజా

బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ అనతి కాలంలోనే ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరించింది. అయితే చైనా మాత్రం వైరస్ బారినుంచి ఇతర దేశాలకంటే ముందే బయటపడింది.

దీంతో ఆ దేశంలో స్కూళ్లను తిరిగి ప్రారంభించారు. అంతా మంచిగానే ఉందనుకుంటున్న సమయంలో కరోనా మరోమారు తన పంజాను స్కూళ్లపై విసిరింది. చైనాలోని షాంఘై, తాంజిన్, మంజోలీ నగరాలలోని స్కూళ్లలో కొత్త కేసులు బయటపడినాయి. దీంతో చైనా ప్రభుత్వం స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించింది. పాకిస్థాన్ లోనూ కరోనా ప్రభావం పెరిగిపోవడంతో స్కూళ్లను మూసివేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.