FbTelugu

లక్షకు దిగిన పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడంతో దేశంలో కరోనా కేసులు గత రెండు వారాలుగా క్రమంగా తగ్గి తాజాగా ఒక లక్ష పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. రెండు నెలల కనిష్టానికి కేసులు నమోదు కావడమే కాకుండా రికవరీ రేటు 94 శాతానికి చేరువైంది.

గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,00,636 పాజిటివ్ నిర్థారణ కాగా, 2,427 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 15,87,589 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 2,89,09,975 మందికి పాజిటివ్ రాగా, 3,49,186 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 1,74,399 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా రికవరీ రేటు 94 శాతానికి చేరుకున్నది. యాక్టివ్ కేసులు 14,01,609 ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.