FbTelugu

సిడ్నీకి దడపుట్టిస్తున్న డెల్టా వైరస్

సిడ్నీ: కరోనా వైరస్ ను నియంత్రించడం కోసం ఆస్ట్రేలియా అనేక చర్యలు తీసుకున్నది. ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి వ్యాధి వ్యాపించకుండా చూసింది. అయినా డెల్టా వైరస్ రకం ఇప్పుడు గడగడలాడిస్తున్నది.
సిడ్నీ నగరంలో డెల్టా రకంతో కరోనా కేసులు నమోదు అవుతుండడంతో ఆందోళన కలిగిస్తున్నది. నగరంలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి బాధితుల ఇళ్ల చుట్టుపక్కల వారిని బయటకు రాకుండా చూస్తున్నారు. వారికి అవసరమైన నిత్యావసరాలను ప్రభుత్వమే సమకూర్చుతున్నది. అంతర్జాతీయ విమాన సిబ్బందిని సిడ్నీ ఏయిర్ పోర్టు నుంచి క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్న సందర్భంగా ఒక బస్సు డ్రైవర్ కు డెల్టా వైరస్ సోకింది. అతని ద్వారా డజన్ల కొద్దీ మందికి వైరస్ వ్యాపించినట్లు ఆరోగ్య శాఖ నిర్థారణకు వచ్చింది. వేగంగా విస్తరిస్తున్న డెల్టారకం కేసులను నియంత్రించేందుకు ఎక్కడికక్కడ లాక్ డౌన్ విధించారు. గతంలో తీసుకున్న కట్టడి చర్యలు, ముందు జాగ్రత్తల కారణంగా ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 30వేల పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కేవలం 910 మంది మాత్రమే చనిపోయారు. అంటే ప్రజల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

You might also like

Leave A Reply

Your email address will not be published.