FbTelugu

ఏపీలో 3.61 లక్షలకు చేరిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. నిన్న ఒక్కరోజే ఏపీలో 8,601 కరోనా కేసులు నమోదైనాయి.

అదే సమయంలో 86 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,61,712 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 3,368 కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,68,828 మంది కరోనా బారినుంచి బయటపడ్డారు. దీంతో యాక్టీవ్ కేసుల సంఖ్య 89,516 కి చేరింది.

You might also like