FbTelugu

17.5 లక్షలకు చేరిన కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా నమోదౌతున్న కరోనా పాజిటిక్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,50,723 కి చేరింది.

ఇప్పటి వరకు కరోనా బారిన పడి 11,45,629 మంది కోలుకున్నారు. అనగా దేశంలో 65.44 శాతం ప్రజలు కరోనా బారినుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 5,67,730 కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 37,364 కి చేరింది.

You might also like