FbTelugu

భారత్ లో కరోనా కేసులు @5,09,446

న్యూఢిల్లీ: భారత్ లో లాక్ డౌన్ కు సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా వైరస్ ఒక్కసారిగా విజృంభించించి. గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతూ వస్తోంది. నేటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,09,446 కు చేరింది.

గడిచిన ఒక్కరోజే దేశంలో 18,276 పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 381 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 15,689 కి చేరింది. ఇప్పటివరకు దేశంలో ఈ వైరస్ బారిన పడి 2,95,917 మంది కోలుకున్నారు. కాగా ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1,97,840గా ఉంది.

You might also like