FbTelugu

భారత్ లో కరోనా కేసులు @ 3,66,946

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రంగా విజృంభిస్తోంది. దేశంలో లాక్ డౌన్ కు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,66,946కి చేరింది. కేంద్ర వైద్యారోగ్యశాఖ వివరాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం యక్టీవ్ కేసుల సంఖ్య 1,60,384గా ఉంది. ఈ వైరస్ బారినుంచి ఇప్పటి వరకు 1,94,325 మంది కోలుకున్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లోనే దేశంలో కొత్తగా 12,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కాగా గడిచిన 24 గంటల్లోనే 334 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12,237 కు చేరింది.

You might also like