FbTelugu

భారత్ లో కరోనా కేసులు @1,73,763

న్యూఢిల్లీ: నేటికి దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,73,763 కు చేరింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 7,964 మందికి కరోనా సోకింది.

అదే సమయంలో 265 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. నేటివరకు కరోనాతో దేశవ్యాప్తంగా 4,971 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 86,422 కి చేరింది.  ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 82,370 మంది డిశ్చార్జ్ అయినారు.

You might also like