FbTelugu

భారత్ లో కరోనా కేసులు @1,58,333

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,333కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 6,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

కరోనా బారిన పడి ఇప్పటివరకు 67,692 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 86,110 కి చేరింది. దేశంలో కరోనా తాజా సమాచారాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదలచేసింది. గడిచిన 24 గంటల్లోనే కరోనాతో 194 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,531కి చేరింది.

You might also like