FbTelugu

భారత్ లో కరోనా కేసులు @1,31,103

న్యూఢిల్లీ: భారత్ లో లాక్ డౌన్ సడలించిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతూ వస్తున్నాయి. నేటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,31,103 కు చేరింది.

గడిచిన 24 గంటల్లోనే దేశంలో 6,309 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 139 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 72,940 కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినుంచి 54,298 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం మృతుల సంఖ్య 3,865 కు చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.