FbTelugu

దేశంలో అరకోటి దాటేసిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా అర కోటీ (50.20 లక్షలు) దాటేసింది.

గడిచిన 24 గంటల్లోనే దేశంలో కొత్తగా 90,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 1,209 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 82,066 కి చేరింది. ఇప్పటి వరకు దేశంలో 39,42,360 మంది కరోనా బారినుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 9,95,933 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like