న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 8 లక్షల మార్క్ ను దాటేసింది.
గడిచిన 24 గంటల్లోనే దేశంలో 27,761 కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 521 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,22,603 కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 22,144 కి చేరింది. కాగా దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2,84,253 కి చేరింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 5,16,203 మంది కోలుకున్నారు.