న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటీవ్ రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే దేశంలో 15,413 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో కొత్తగా 306 కరోనా మరణాలు నమోదైనాయి.
దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,10,461 కి చేరుకుంది. కరోనా బారినుంచి ఇప్పటి వరకు 2,27,755 మంది కోలుకుని బయటపడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1,69,451కు చేరింది.