FbTelugu

తెలంగాణలో లక్షదాటిన కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లోనే రాష్ట్రంలో కొత్తగా.. 2,474 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో ఏడుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు.

దీంతో తాజా కేసులతో కలిపి నేటికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,865 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 744 కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 78,735 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 22,386 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like