FbTelugu

ఏపీలో 5వేలు దాటిన కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన వారం పది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 5,086 కరోనా కేసులు నమోదుకాగా.. మహమ్మారికి చిక్కి నిన్న ఒక్కరోజే 14మంది బలయ్యారు.

చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురం, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 9,42,135కి చేరగా.. మరణాల సంఖ్య 7,353కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 24గంటల్లో 1,745 మంది కోవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 9,03,072 మంది డిశ్చార్జీ అయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.