FbTelugu

13 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు గత కొన్ని రోజులుగా తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 13,36,861 కి చేరింది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 48,916 కేసులు నమోదైనాయి. ఇప్పటివరకు కరోనాతో 31,358 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు దేశంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 8,49,431కి చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో 4,56,071 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like