ప్రపంచ వ్యాప్తం కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. నేటికి ప్రపంచ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఏకంగా 31 లక్షలకు చేరువైంది. నేటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30,83,467 కు చేరింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 2,13,824 మంది మృత్యువాత పడ్డారు.
అయితే అత్యధికంగా అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటివరకు 10,33,721 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఈ వైరస్ సోకి 58,947 మంది మరణించారు. ఆ తర్వాతి స్థానంలో స్పెయిన్ ఉంది. స్పెయిన్ లో ఇప్పటి వరకు 2,10,773 కేసులు నమోదు కాగా.. 23,822 మంది మరణించారు.