FbTelugu

95 లక్షలకు చేరువైన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో నిన్న ఒక్క రోజే కొత్తగా 36,604 మందికి కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో కరోనాతో 501 మంది మృత్యువాత పడ్డారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం..

గత 24 గంటల్లో 43,062 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,99,414కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,38,122 కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారిలో 89,32,647 మంది కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 4,28,644 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.