FbTelugu

20 లక్షలకు చేరువైన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరగిపోతూ ఉంది. దేశంలో గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 56,282 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19లక్షల, 64 వేల, 536 కి చేరింది. ఇదే సమయంలో మొత్తం మరణాల సంఖ్య 40 వేలకు చేరింది. కరోనా బారిన పడి 13.28 లక్షల మంది కోలుకున్నారు. నిన్న మొత్తం 6.65 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.

You might also like