FbTelugu

2 లక్షలకు దగ్గరగా కరోనా కేసులు

ఢిల్లీ: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తరువాత దేశంలో కరోనా కేసులు ఊహించని విధంగా కేసులు పెరుగుతున్నాయి. తొలిసారి విధించి లాక్‌డౌన్‌ మూలంగా కరోనా పాజిటివ్ కేసుల పూర్తి నియంత్రణలో ఉన్నాయి.

నిబంధనలను మరింతగా సడలిస్తూ పోతుండగా, మరోవైపు అంతే వేగంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8392 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ ప్రభావంతో 230 మంది మృతిచెందారు.

దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,90,535కి చేరుకున్నది. ఇందులో 93,322 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 91,819 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశంలో ఇప్పటివరకు మహమ్మారి వైరస్‌ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 5394కు చేరింది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ 7వ స్థానానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు.

తొలి ఆరు స్థానాల్లో వరుసగా అమెరికా, బ్రెజిల్‌, రష్యా, స్పెయిన్‌, బ్రిటన్‌, ఇటలీ దేశాలు ఉన్నాయి. ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 65,168 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

You might also like