FbTelugu

15 లక్షలకు చేరువైన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకి రికార్డు స్థాయిలో నమోదౌతున్నాయి. దేశంలో కరోనా కేసులు 15 లక్షలకు చేరువైనాయి. గడిచిన ఒక్క రోజులోనే దేశంలో కొత్తగా 47,704 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. అదే సమయంలో 654 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,83,157కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 33,425 కి చేరింది. దేశంలోని వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 4,96,988 మందికి చికిత్స కొనసాగుతోంది. కాగా కరోనా బారిన పడి ఇప్పటి వరకు 9,52,743 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జి అయినారు.

You might also like