FbTelugu

స్మశాన వాటికలో 8 గంటలు నిరీక్షించాల్సిందే!

వారణాసి: ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. వైరస్ బారిన పడి పలువురు మృతి చెందుతున్నారు. మృతదేహాల దహనం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.

వారణాసిలో హరిశ్చంద్ర ఘాట్ కు ప్రతి రోజు సగటున 40 వరకు మృతదేహాలు వచ్చేవి. ఇలా వచ్చిన మృతదేహాలను వెంట వెంటనే స్మశాన వాటిక సిబ్బంది దహనం చేస్తుండేవారు. కరోనా వైరస్ తీవ్రత పెరగడంతో మృతులు కూడా పెరుగుతన్నారు. గత వారం పది రోజుల నుంచి ప్రతి రోజు 120 వరకు మృతదేహాలు అంత్యక్రియల కోసం వస్తున్నాయి. మూడు రెట్లు పెరగడంతో రద్దీ ఏర్పడింది. బిహార్ మోకామా కు చెందిన సుధీర్ తండ్రి బి.హెచ్.యులో కరోనాతో మృతి చెందారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందగా అంత్యక్రియల కోసం ఘాట్ కు తీసుకువచ్చాడు. దహనం చేసేందుకు అర్థరాత్రి 12 గంటల వరకు నిరీక్షించి పూర్తి చేసుకుని వెళ్లాడు.

మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ముంబయి తో పాటు నాగ పూర్ నగరాల్లో దహన వాటికల్లో అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు నిరీక్షిస్తున్నారు. కనీసం ఐదారు గంటల పాటు స్మశాన వాటికల్లో నిలిచి ఉంటున్నామని పలువురు వాపోతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.