FbTelugu

ఏపీలో 5 వేలు దాటిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. ఏపీలో కొత్తగా మరో 216 కేసులు నమోదైనాయి. వీరిలో ఏపీ వారు 147 మంది ఉండగా.. ఇతర ప్రాంతాల వారే 69 మంది ఉండడం గమనార్హం.

దీంతో నేటికి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,029 కి చేరింది. వీరిలో 2,403 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1510 కి చేరింది.  ఇప్పటివరకు రాష్ట్రంలో 77 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.