FbTelugu

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదైనాయి. ఇవాళ కొత్తగా 2,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కాగా గడిచిన 24 గంటల్లోనే ఏపీలో 44 మంది కరోనాతో మృతి చెందారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35,451 కి చేరింది. కాగా ఇప్పటి వరకు 18,378 మంది కరోనా బారినుంచి కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు.

You might also like