FbTelugu

కరోనా కేసులు 70వేలే

న్యూఢిల్లీ: దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఆంక్షలు అమలు చేస్తుండడంతో తాజాగా 75వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో 70,421 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఆదివారం నాడు దేశ వ్యాప్తంగా 14,92,152 మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 70,421 మందికి వైరస్ సోకింది. నిర్థారణ పరీక్షలు కూడా తగ్గడంతో కేసులు కూడా తగ్గినట్లు కన్పిస్తున్నది. గడచిన 24 గంటల్లో 3,921 మంది చనిపోగా ఇప్పటి వరకు 3,74,305 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 10 లక్షల వరకు ఉండగా, ఆదివారం నాడు 1,19,501 మంది రికవరీ అయ్యారు. పాజిటివ్ కేసుల రికవరీ రేటు 95.43 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.