FbTelugu

3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ఒక్క రోజే 2వేలకు పైగా మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో 2.95 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయి మూడు లక్షలకు చేరువైంది. కరోనా ప్రారంభమైన తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

గడచిన పది రోజులుగా దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. అదే విధంగా గత 24 గంటల్లో 2023 మందిని బలితీసుకున్నది. ఇంత సంఖ్యలో చనిపోవడం కూడా ప్రథమం అంటున్నారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16,39,357 మందికి పరీక్షలు నిర్వహించగా 2,95,041 మందికి పాజిటివ్ నిర్థారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130 కు చేరింది. గత 24 గంటల్లో 2023 మంది చనిపోగా, ఇప్పటి వరకు 1,82,553 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో 519 మంది, ఢిల్లీలో 277, ఉత్తరప్రదేశ్ లో 162 మంది చనిపోయారు. ఈ మూడు రాష్ట్రాలతో పాటు కర్ణాటక లో కూడా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.