FbTelugu

బ్రెజిల్ అధ్యక్షుడి పై కరోనా కేసు

సావో లుయిస్: మన దేశంలో ముఖ్యమంత్రులు మాస్కులు పెట్టుకోకుండా కరోనా వార్డుల్లో తిరిగినా కేసులు పెట్టరు. రూల్స్ అతిక్రమించి రోడ్లపై రాంగ్ రూట్ లో ప్రయాణించినా ఎవరూ చర్యలు తీసుకోరు.
కాని విదేశాల్లో అలా కాదు. కరోనా మహమ్మారితో బ్రెజిల్ దేశం విలవిల్లాడుతున్నది. వైరస్ ను నియంత్రించడంలో ఘోరంగా వైఫల్యం చెందారని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉల్లంఘించారు. మారన్ హవో రాష్ట్రంలో వంద మందికి పైగా పాల్గొనే సమావేశాలపై నిషేధం అమలులో ఉంది. మాస్క్ ధరించకపోతే జరిమానా వేస్తున్నారు. లూయిస్ నగరంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు బోల్సోనారో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కనీసం మాస్క్ కూడా ధరించలేదు. కరోనా ఆంక్షలను అమలు చేస్తున్న రాష్ట్ర గవర్నర్ ను చబ్బీ డిక్టేటర్ అని విమర్శించారు.
ఈ విమర్శలపై రాష్ట్ర గవర్నర్ ఫ్లావియో డైనో కఠినంగా స్పందించారు. కరోనా ఆంక్షలు అమలులో ఉండగా కార్యక్రమంలో పాల్గొనడం నిషేధం అని, నిబంధనలు ఉల్లంఘించారని గవర్నర్ కార్యాలయం తెలిపింది. బోల్సోనారో పై ఉల్లంఘన కేసు నమోదు చేయాల్సిందిగా అదికారులను గవర్నర్ ఆదేశించారు. దీనిపై అప్పీల్ వెళ్లేందుకు రెండు వారాల సమయం ఇచ్చారు. బ్రెజిల్ లో మొదటి నుంచి కరోనా నిబంధనలు అమలు చేయడంలో అధ్యక్షుడు బోల్సోనారో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అమెరికా తరువాత అత్యధికంగా ఆరు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.

You might also like

Leave A Reply

Your email address will not be published.