FbTelugu

ఆంధ్రాలో కరోనా ఉధృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,972 కరోనా కేసులు నమోదు కాగా 71 మంది చనిపోయారు. తాజా మరణాలతో కలిపితే ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 8,207కి చేరింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,15,275 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 10,227 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ప్రస్తుతం 1,51,852 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తూర్పు గోదావరి, విజయనగరంలో 9 మంది చొప్పున చనిపోగా, కర్నూలు, అనంతపురంలో ఏడుగురు, ప్రకాశం, శ్రీకాకుళంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు చొప్పున చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.