FbTelugu

అభినవ సావిత్రి… కరోనా భర్తకు నోటితో శ్వాస!

ఆగ్రా: తన కళ్ల ముందే భర్త శ్వాస అందక నరకయాతన పడుతుంటే భార్య చూడలేకపోయింది. భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టింది.
తన నోటి ద్వారా ఆయనకు శ్వాస అందించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ భర్త ఆసుపత్రి చేరుకునేలోపే ప్రాణాలు విడిచాడు.

ఈ హృదయ విదారక ఘటన ఆగ్రాలో జరిగింది. రవి సింఘాల్‌(47) కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన పరిస్థితి హఠాత్తుగా విషమించడంతో భార్య రేణు సింఘాల్‌ ఆటోలో అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ఆటో ఏర్పాటు చేసింది. ఆస్పత్రి వెళ్లే మార్గ మధ్యలోనే భర్త రవి పరిస్థితి విషమించింది. ముక్కుతో శ్వాస ఆడక నోటితో గాలిపీల్చుకునేందుకు యత్నిస్తూ యాతన అనుభవించాడు. భర్త బాధ చూసి భార్య తట్టుకోలేకపోయింది. తనకూ ప్రమాదమని తెలిసి కూడా రేణ.. భర్త నోటిని తన నోటితో మూసి బలంగా గాలి ఊదింది. ఇలా అతనికి ఊపిరి పోసేందుకు యత్నించింది. అలా కొన్ని నిమిషాల పాటు గాలి పంపినప్పటికీ ప్రాణం నిలబడలేదు. శ్వాస ఆడకపోడంతో భార్య వడిలోనే భర్త రవి తల వాల్చేశాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన పలువురు కన్నీరు పెట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.