FbTelugu

‘పుష్ప’ కు కరోనా బ్రేకులు

తెలుగు స్టార్ సినీ హీరో అల్లూ అర్జున్ విలక్షణ పాత్రలో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా రోజుల పాటూ.. వాయిదా పడి ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్ లు ప్రారంభమైనాయి. అయితే తాజాగా.. ఇటీవల యూనిట్ సభ్యుడు ఒకరు మృతి చెందారు.

ఆ తర్వాత నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో పలువురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దీంతో ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ను నిన్న నిలిపివేసినట్టుగా సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం తూర్పు మన్యంలో సాగుతున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.