FbTelugu

తిరుమలలో కరోనా విజృంభణ

15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్

తిరుమల: కరోనా వైరస్ ఎవరినీ వదిలేలా లేదు. మాస్క్ లేకుండా పూజలు చేస్తున్న అర్చకులకు కరోనా పాజిటివ్ సోకింది. భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తాజాగా తిరుమలలో ఏడుగురు అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిని శ్రీనివాసం క్వారంటైన్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీరి ద్వారా కుటుంబ సభ్యులకు ఎంత మందికి వచ్చిందనే దానిపై పరీక్షలు నిర్వహించారు. వీరికి సంబంధించిన టెస్టు రిపోర్టులు రావాల్సి ఉంది.
తిరుమలలో ఇప్పటికే 8 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ సోకింది. తాజాగా నమోదు అయిన కేసులతో మొత్తం 15 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. పరిస్థితిని సమీక్షించేందుకు తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

తిరుమల ఆలయంలో, బయట అర్చకులు ఎలాంటి మాస్కులు ధరించకుండా, శానిటైజర్లు ఉపయోగించకుండా విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా వీటిని వినియోగించేలా టీటీడీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

You might also like