FbTelugu

హైదరాబాద్ లో కరోనా విజృంభణ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే 79 కేసులు నమోదు అయ్యాయి.

ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం 1275 కేసులు నమోదు కాగా 801 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. యాక్టీవ్ కేసులు 444 ఉండగా ఈరోజు 50 మంది కొలుకున్న వారిని డిశ్చార్జీ చేశారు. ఇప్పటి వరకు 30 మంది చనిపోయారు.

పాతబస్తీ జియగూడ ప్రాంతంలో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలిసింది. కరోనాతో రిటైర్డ్ ఉద్యోగి (75) మృతి చెందడంతో జియగూడలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దుకాణాలు మొత్తం మూసివేయించి, ప్రజలు ఇళ్లనుంచి  బయటకు రావద్దని కుల్సుమ్ పురా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అదే విధంగా అమీర్ పేట నేచర్ క్యూర్ ఆసుపత్రిలో 30 కరోనా పాజిటివ్ కేసుల నమోదు అయినట్లు సమాచారం. వీరందరినీ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

You might also like