FbTelugu

కరోనా మళ్లీ విజృంభణ.. అప్రమత్తం చేసిన కేంద్రం!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ పలు రాష్ట్రాలను ముందస్తు అప్రమత్తం చేసింది. అకస్మాత్తుగా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, పంజాబ్, కేరళ రాష్ట్రాలలో ఇటీవల రోజువారి కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని వెల్లడించింది.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 6112 కేసులు నమోదు అయ్యాయయని, అంతకు ముందు కూడా మూడు నాలుగు రోజులు నాలుగు వేల చొప్పున నమోదు అయినట్లు పేర్కొంది. మహారాష్ట్ర మాదిరే పంజాబ్ లో కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దేశం మొత్తం పాజిటివ్ కేసులలో కేరళ, మహారాష్ట్రలో మాత్రమే 75 శాతం కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. గత ఐదు రోజులుగా పెరుగుతున్న కేసులతో కేంద్రం కూడా ఆందోళనకు గురవుతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.